సచివాలయంలోని తన కార్యాలయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కనెక్ట్ టు ఆంధ్రా వెబ్ పోర్టల్‌ను ఆవిష్కరించారు. సీఎస్‌ఆర్ నిధులు, దాతలు, సంస్థలు, ప్రవాసాంధ్రులనుంచి వచ్చే సహాయం కోసం వైబ్‌సైట్ ప్రారంభించారు. దీనికి ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా, సీఎస్ వైస్ ఛైర్మన్‌గా ఉన్నారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల్లో భాగస్వామ్యం కోసం సీఎం పిలుపు కోసం తమ సొంత గ్రామంలో అమలవుతున్న నవరత్నాలు, నాడు–నేడు సహా, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు ఎవరైనా సహాయం చేయొచ్చు.కనెక్ట్ టు ఆంధ్రా వెబ్ ప్రారంభం తర్వాత ప్రవాస ఆంధ్రులను ఉద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు.
సొంత రాష్ట్రం మీద మీ ప్రేమాభిమానాలు చూపించడానికి ఇదొక మంచి అవకాశం. మీరు ఎంత సహాయం చేస్తారన్నది ముఖ్యంకాదు, మీ గ్రామానికి లేదా మీ నియోజకవర్గానికి లేదా మీ జిల్లాలో మీరు ఏ కార్యక్రమైనా చేపట్టవచ్చు. లేదా ఏ కార్యక్రమానికైనా ఎంత మొత్తమైనా సహాయం చేయవచ్చు. మెరుగైన రాష్ట్రం కోసం మీరు ఎంతోకొంత మంచిచేయడానికి ఖండాతరాల్లో ఉన్న వారంతా ముందుకు రావాలి అని కోరారు. జగన్ సారధ్యంలో సొంత గ్రామాలకు సేవ చేసేందుకు ప్రవాసాంధ్రులు ఆసక్తి చూపుతున్నారు.