Home / ANDHRAPRADESH / చంద్రబాబును అడ్డంగా బుక్ చేసిన టీడీపీ మాజీ మంత్రి..!

చంద్రబాబును అడ్డంగా బుక్ చేసిన టీడీపీ మాజీ మంత్రి..!

టీడీపీ సీనియర్ నేత, అయ్యన్నపాత్రుడు గత ఐదేళ్లు నర్సీపట్నం ఎమ్మెల్యేగా, మంత్రిగా అధికారం చెలాయించాడు. అధికారంలో ఉన్నామనే ధీమాతో, తమను ఎవరూ అడ్డుకోలేరనే అహంకారంతో అయ్యనపాత్రుడు, ఆయన తనయుడు స్వయంగా డ్రగ్స్, గంజాయి మాఫియాలను ప్రోత్సహించారని వైసీపీ నేతలు అప్పట్లో తీవ్ర విమర్శలు చేశారు. కాగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో అయ్యన్నపాత్రుడు ఓటమి పాలయ్యారు. అయితే తాజాగా అయ్యన్నపాత్రుడు ప్రస్తుత రాజకీయాలపై స్పందించాడు. రాజకీయాలు చాలా కాస్ట్‌లీగా మారిపోయాయి. ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే రూ. 20 కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. డబ్బు ఒక్కటే కాదు మద్యం కూడా బాగా పంచాలి. ఇన్ని కోట్లు ఖర్చుపెట్టి గెలిచినవారు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏం చేస్తారు..తాము పెట్టిన డబ్బు తిరిగి సంపాదించుకోవాలని ప్రయత్నిస్తారు..ప్రజల పనులకు బదులు సొంత పనులు చేసుకుంటారు..నేను 12 సార్లు పోటీ చేశా..ఈ ఎన్నికల్లో చూసిన పరిస్థితి ఏనాడూ చూడలేదంటూ…అయ్యన్నపాత్రుడు వాపోయినట్లు ఓ పచ్చ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అయ్యన్న సుద్దులపై పెద్ద ఎత్తున కౌంటర్లు పడుతున్నాయి. అయ్యన్న గారు..రాజకీయాలను కాస్ట్‌లీగా మార్చిందే మీ బాబుగారు..1995లో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన తర్వాత తనకు ప్రజాబలం లేదని గ్రహించిన మీ బాబుగారే వందల కోట్లు ఖర్చుపెట్టి మళ్లీ గెలిచాడని స్వయంగా మీ చంద్రజ్యోతి పత్రికే రాసిందని నెట్‌జన్లు గుర్తు చేస్తున్నారు. అంతే కాదు ఎక్కడ ఉప ఎన్నికలు వచ్చినా..200 -300 కోట్లు ఖర్చుపెట్టేది..మీ బాబుగారే..నంద్యాల ఉప ఎన్నికలలో 200 కోట్లు ఖర్చుపెట్టలేదా అని అయ్యన్నను నిలదీస్తున్నారు. అసలు ఉమ్మడి రాష్ట్రంలో ఓటుకు వేయి నుంచి 5 వేలు 10 వేల వరకు ఇచ్చిన చరిత్ర చంద్రబాబుది కాదా..కావాలంటే నంద్యాల ఉప ఎన్నికల్లో నేను వేసిన రోడ్డు మీద నడుస్తూ..నాకు ఓటేయరా..నేను ఇస్తున్న పింఛర్ తీసుకుంటూ…నాకు ఓటేయరా..నాకు ఓటుకు 10 వేలు ఇచ్చి కొనే దమ్ముంది అని చంద్రబాబు ప్రజలను బెదిరించలేదా..ఒకసారి పాత వీడియోలు చూడు అయ్యన్న సలహా ఇస్తున్నారు. అంతే కాదు..తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు 5 కోట్లు లంచం ఇవ్వబోతూ..బీఫ్డ్‌మీ అంటూ మీ బాబుగారు అడ్డంగా దొరికిపోయి హైదరాబాద్ నుంచి అర్థరాత్రి పారిపోయింది నిజం కాదా అని అయ్యన్నను ప్రశ్నిస్తున్నారు. సాక్షాత్తు ఏపీ మాజీ స్పీకర్, మీ పార్టీ సీనియర్ నేత, స్వర్గీయ కోడెల ఎన్నికల్లో గెలవడానికి 11 కోట్లు ఖర్చుపెట్టానని పబ్లిక్‌గా చెప్పలేదా..అంతెందుకు 2014 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మెజారిటీ ఉన్నా 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరికి రూ. 20 కోట్లు క్యాష్, వందలాది కోట్ల కాంట్రాక్టు పనులు అప్పగిస్తామని ఆశచూపించి మీ పార్టీలోకి లాక్కోలేదా..అసలు తెలుగు రాజకీయాలను కాస్ట్‌లీ అయ్యాయంటే.అంతా మీ బాబుగారి చలవే..అయ్యన అంటూ నెట్‌జన్లు అయ్యనపాత్రుడిపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. మొత్తంగా రాజకీయాలు కాస్ట్‌లీ అయ్యాయంటూ అయ్యన్న పాత్రుడు బాబుగారిని అడ్డంగా బుక్ చేశాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat