అమితాబ్ బచ్చన్ ఈ పేరు తెలియని భారతీయ సినీ ప్రేమికుడు లేడంటే అతిశయోక్తి కాదు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని భాషల్లోనూ అమితాబ్ బచ్చన్ కు అభిమానులున్నారు. అయితే అమితాబచ్చన్ మొట్టమొదటి చిత్రం సౌత్ హిందుస్తానీ 1969 నవంబర్ 7వ తేదీన విడుదల ఇప్పటికి 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. 50 సంవత్సరాల తన సినీ ప్రయాణంలో అమితాబచ్చన్ చేరని గమ్యం లేదు ఆయన చేయని అద్భుతం లేదు అంటే అతిశయోక్తి కాదు. ఈ యాభై సంవత్సరాలలో ఎన్నో ఆటుపోట్లు లో అమితాబ్ నిలదొక్కుకున్నారు. పలు రాజకీయ పార్టీలకు ఆయన సేవలందించారు.
సినిమాల్లోనే కాకుండా రియాల్టీ షోల ద్వారా కూడా అలరించారు. కౌన్ బనేగా కరోడ్పతి అంటూ అమితాబ్ చేసిన రియాల్టీ షో ఎప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటుంది. 50 సంవత్సరాల ప్రయాణం ఒక ఇండస్ట్రీలో చేయడం మామూలు విషయం కాదు. అమితాబ్ బచ్చన్ జయా బచ్చన్ ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ ఇలా కుటుంబం మొత్తం నటులే కావడంతో అమితాబ్ బిగ్ బి అయ్యారు. తాజాగా 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అమితాబ్ మాట్లాడుతూ తన ఆరోగ్య పరిస్తితి గురించి సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో పంచుకున్నారు. అయితే తాను మళ్లీ అభిమానులను అలరించేందుకు సినిమాల్లోకి వస్తానని మళ్లీ నటిస్తా అంటూ అమితాబ్ ప్రకటించారు. ఇక్కడే అర్థమవుతుంది ఆయనకు సినిమాల పట్ల ప్రేక్షకుల పట్ల ఎంత ప్రేమ ఎంత ప్యాషన్ ఉన్నాయో అని.