ఏపీలో భవన నిర్మాణ కార్మికులు ఇసుక కొరతతో చనిపోతున్నారంటూ చంద్రబాబు, ఎల్లోమీడియా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల తాడేపల్లిలో ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పని చేసే నాగరాజు అనే వాచ్‌మెన్ ఆత్మహత్య చేసుకుంటే..డబ్బులిస్తాం..శవాన్నివ్వండి..ఇసుక కొరత వల్ల చనిపోయాడంటూ..రోడ్డుపై ధర్నా చేస్తామని టీడీపీ నేతలు మృతుడి కుటుంబసభ్యులపై వత్తిడి చేశారు.అలాగే..బాపట్లలో నలుకుర్తి రమేశ్ అనే వ్యక్తి వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకుంటే.. 5 లక్షలు వస్తాయి..ఇసుక కొరత వల్ల చనిపోయాడని చెప్పండి అన్ని రెండు ఎల్లోమీడియా ఛానళ్లు చేసిన కుట్రలను అతడి కుటుంబసభ్యులే బయటపెట్టారు. అయితే చంద్రబాబు మాత్రం ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు 10 మందికి పైగా చనిపోయారని, బాబు పార్టనర్ పవన్ కల్యాణ్ 30 మంది చనిపోయారని అడ్డగోలుగా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. తాజాగా బాబుగారు వ్యక్తిగత కారణాలతో చనిపోయిన ఓ మృతుడి కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. బాబు శవరాజకీయంపై వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు. అప్పట్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే తిన్నది అరక్క చస్తున్నారని, అసలు మృతుల కుటుంబాలకు పరిహారం ఇస్తే డబ్బు కోసం ప్రాణాలు తీసుకుంటారని చంద్రబాబు హేళన చేశాడని గుర్తు చేశారు. ఇప్పుడు ఎవరో వ్యక్తిగత కారణాలతో చనిపోతే 25 లక్షల కాంపెన్షేషన్ ఇవ్వాలంటున్నాడు. అది నోరా తాటిమట్టా బాబూ? అని విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అవును..బాబుగారి నోరు ఎలా అంటే అలా వంకరలు పోతుంది..ఎలా అంటే అలా నాలిక మడతపడిపోతుంది.. ..అది నిజంగా తాటిమట్టే అని నెట్‌జన్లు విజయసాయిరెడ్డి ట్వీట్‌కు స్పందిస్తున్నారు.