2019 ఎన్నికల సమయంలో పిచ్చ పాపులర్ అయిన టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాధినేని పార్టీకి రాజీనామా చేస్తునట్లు తెలుస్తోంది. పార్టీలో చేరిన అనతికాలంలోనే చంద్రబాబుకు, లోకేష్లకు అత్యంత సన్నిహితంగా మారిన యామిని టీడీపీలో ఓ వెలుగు వెలిగింది. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీ తరపున వాయిస్ బలంగా వినిపించిన మహిళా నేతల్లో యామిని ముందువరుసలో ఉంటారు. సోషల్ మీడియాలో టీవీ చర్చల్లో ప్రత్యర్థులపై యామిని తీవ్ర పదజాలంతో విరుచుకుపడేవారు. సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థులపై యామిని చేసిన కామెంట్స్ కాంట్రవర్సీగా మారేవి. ముఖ్యంగా పవన్ కల్యాణ్ మల్లెలు నలుపుతాడంటూ..ఆమె చేసిన కామెంట్స్ తీవ్ర వివాదాస్పదంగా మారాయి. అయితే ఇంతల టీడీపీ పార్టీపై అభిమానం చూపిన యామిని బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.ఈ విషయంలో ఆమె కూడా రాష్ట్ర బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణతో చర్చలు కూడా జరుపుతున్నారని టాక్ వినిపిస్తోంది. అన్ని కుదిరితే ఈ నెల 10న అధికారికంగా కమలం పార్టీలో చేరునున్నారని సమాచారం. దీంతో సోషల్ మీడియాలో యామినిపై కామెంట్స్ హల్ చల్ చేస్తున్నాయి. ఏమైంది. యామిని..ఏం జరిగింది..నీవు పార్టీ మారడం ఏంటి అసలు అంటూ తెగ హల్ చల్ చేస్తున్నారు.
