పీకే ని ఎందుకు పక్కదోవ పట్టిస్తున్నారనే ప్రశ్న అందరూ జనసేన అభిమానుల్లోనూ ఉత్పన్నమవుతోంది. టాలీవుడ్ లో అగ్ర కథానాయకుడిగా అత్యంత ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే నటుడిగా పేరు గాంచిన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాక ఆయన తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు సగటు జనసేన కార్యకర్త కూడా మింగుడు పడడం లేదు. తాజాగా కనీసం నాలుగు నెలలు కూడా కాకుండానే ప్రభుత్వంపై పవన్ దుమ్మెత్తి పోస్తున్న విధానం జనసేన కార్యకర్తలకు కూడా నచ్చడం లేదు. ఎందుకంటే జనసేన పార్టీలో తిరిగిన జనసేన పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు గ్రామ సచివాలయం ఉద్యోగాలు రావడంతో పాటు వారి ఇంట్లో సంక్షేమ పథకాల అమలు వారు గమనిస్తున్నారు.
ముఖ్యంగా ఇసుక లో కొన్ని వేల కోట్లు దోచుకున్న తెలుగుదేశం పార్టీకి మద్దతు పలుకుతూ పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన లాంగ్ మార్చ్ అనేక వివాదాలకు కారణమవుతోంది. ముఖ్యంగా జనసేన పార్టీ పవర్ కోసం కాదు ప్రశ్నించడం కోసం అని వచ్చినప్పటి నుంచి 2014 నుండి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వానికి అండగా నిలిచింది. అయితే వరదల కారణంగా ఇసుక లేదని చెప్తున్న పవన్ అనవసర రాద్ధాంతం చేయడం పట్ల జనసేన కార్యకర్తలు విసుక్కుంటున్నారు.. ముఖ్యంగా ఇలాంటి సలహాలిస్తూ ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారని తమపార్టీపై వాళ్లే ఆగ్రహిస్తున్నారు.