మాజీమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు లోకేష్ ను తెలుగుదేశం పార్టీలోని కొందరు అత్యుత్సాహంతో తొందర పడుతున్నట్టుగా స్పష్టంగా అర్థం అవుతోంది. 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండానే మంత్రి స్థానంలో కూర్చున్న లోకేష్ కు పార్టీ కోసం ఎంత కష్ట పడాలి, ఒక అభ్యర్థి విజయానికి ఎలా కృషి చేయాలి అనేది స్వయంగా ఇప్పటివరకు అనుభవం లేదు. ఎందుకంటే లోకేష్ పోటీ చేయలేదు కాబట్టి. ఆయనకు నాలుగు శాఖలు ఉన్న మంత్రి పదవి అత్యంత సునాయాసంగా వచ్చేసింది. అంతే వేగంగా వారి అధికారం కూడా దూరమైపోయింది. ఈ క్రమంలో ప్రభుత్వంపై పోరాటం చేయడానికి లోకేష్ ను ఎవరు కంగారు పెడుతున్నట్లుగా తొందర పాటుకు గురి చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థం అవుతోంది.
ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వ పాలన పోయి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన వచ్చి ఇంకా 200 రోజులు కూడా సరిగ్గా గడవలేదు. వారి వైపు పాలనలో జగన్ అందరి మన్ననలు పొందుతూ ప్రతి వర్గానికీ మేలు చేసే విధంగా ముందుకు వెళ్తున్నారు. అయితే లోకేష్ మాత్రం టీడీపీ తరఫున ప్రతిపక్ష హోదాలో వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేయాలని కొందరు టీడీపీ పెద్దలు సలహాలివ్వడం తో లోకేష్ బాబు ప్రభుత్వంపై పోరాటానికి కాలు దువ్వుతున్నారు. ఇప్పటికే తాను పోటీ చేయకుండా అప్పనంగా అధికారాన్ని అనుభవించిన లోకేష్ ఇప్పుడు ప్రజారంజక పాలన పై పోరాటం చేస్తే ఇంకా ఎటువంటి వ్యతిరేకత లేకపోవడంవల్ల ప్రభుత్వం పై పోరాటం సిద్ధమైతే అది తనకే ఇబ్బంది అనే విషయం తెలుసుకుంటే మంచిది అంటూ కొంతమంది సలహా ఇస్తున్నారు.