మాటల మాంత్రికుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో అలా వైకుంఠపురములో అనే సినిమా తీస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్, సామజవరగమన అనే పాట ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, కథనం పై నమ్మకంతో బన్నీ చేస్తున్న ఈ సినిమా తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పారిస్ లో జరుగుతున్నందున త్రివిక్రమ్ పుట్టినరోజు వేడుకలను అక్కడే మ్యూజిక్ డైరెక్టర్ తమన్, హీరోయిన్ పూజ, నటుడు నవదీప్ తో కలిసి త్రివిక్రమ్ ఓ కుటుంబంలా జరుపుకుంటున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.