తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ శివారు అబ్దుల్ పూర్ మెట్ ఎమ్మార్వో విజయారెడ్డిపై పెట్రోల్ దాడికి దిగి.. ఆమె మృతికి కారణమైన నిందితుడు సురేష్ తీవ్ర గాయాలతో ఉస్మానీయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి విదితమే.
తాజాగా సురేష్ మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. ఎమ్మార్వో పై పెట్రోల్ పోసి తగులబెట్టే సమయంలో అతడికి కూడా మంటలు అంటుకున్నాయి. దీంతో సురేష్ శరీరం అరవై శాతం వరకు కాలింది.
అయితే సురేష్ శరీరం చికిత్సకు సహాకరించడం లేదని వైద్యులు నిన్న బుధవారం ప్రకటించిన సంగతి విదితమే.తాజాగా సురేష్ చనిపోయినట్లు సమాచారం.