భారత మహిళల జట్టు నిన్న వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో 6వికెట్ల తేడాతో విజయం సాధించి. టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ 194పరుగులకే ఆల్లౌట్ అయ్యారు. అనంతరం చేసింగ్ కు దిగిన భారత్ అందరు అనుకునట్టుగానే విండీస్ బౌలర్స్ ను ఉతికి ఆరేసారు. ఈ మ్యాచ్ లో అడుగుపెట్టిన డాషింగ్ ఓపెనర్ మందన్న బౌలర్స్ పై విరుచుకుపడింది. 9ఫోర్లు, 3సిక్స్ లతో 74పరుగులు సాధించింది. దాంతో ఈమె 2000పరుగులు చేసిన మూడో వేగవంతమైన ప్లేయర్ గా నిలిచింది. 51ఇన్నింగ్స్ లో ఆమె ఈ ఫీట్ సాధించింది. మొదటి స్థానంలో క్లార్క్ 41ఇన్నింగ్స్, లన్నింగ్ 45 ఇన్నింగ్స్ తో మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. ఇంక ఓవరాల్ మెన్స్,ఉమెన్స్ పరంగా చూసుకుంటే రెండో స్థానంలో ఉంది.
