టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం లో అత్యంత వివాదాస్పద నటిగా పేరు తెచ్చుకున్న శ్రీ రెడ్డి అనేక సంచలనాలకు తెర లేపారు. గతంలో టీవీ ఛానల్, యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక వివాదాస్పద వ్యాఖ్యలు బూతులు మాట్లాడుతూ ఈమె చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ని టార్గెట్ చేస్తూ శ్రీరెడ్డి పేస్ బుక్ లో పెట్టిన లైవ్ పోస్టింగ్లు ఆమె కామెంట్లు జనసేన శ్రేణులకు అత్యంత ఇబ్బందిని కలిగించేవి. తనను వాడుకుని వదిలేసారు అంటూ పెద్ద ఎత్తున బడా బాబుల పేర్లు ఫోటోలు లీక్ చేస్తూ అనేక సంచలనాలకు తెర లేపింది. ఫిలిం ఛాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శన కూడా చేసి తన నిరసన తెలియజేసింది. అలాంటి శ్రీరెడ్డికి ఇప్పుడు టాలీవుడ్లో ఓ మంచి ఆఫర్ వచ్చిందట. నటకిరీటి రాజేంద్రప్రసాద్ డ్రీమ్ అనే సినిమా తీసిన దర్శకుడు భవాని శంకర్ ఇప్పుడు తాజాగా రాజేంద్రప్రసాద్ కీలక నటుడిగా క్లైమాక్స్ అనే చిత్రాన్ని తీస్తున్నారట. ఈ సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి రాజ్, రాజేంద్రప్రసాద్ లతో పాటుగా శ్రీరెడ్డికి ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారట. ఇప్పటికే వివాదాల మయంగా ఉన్న శ్రీ రెడ్డి ఇకనుంచైనా టాలీవుడ్లో మంచి పేరు సంపాదించుకుంటుంది మరిన్ని అవకాశాలు తెచ్చుకుంటుందా అనేది వేచి చూడాలి.