అన్నం తినే ముందు.. అన్నం తిన్నాక.. ?. టీ తాగుతూ.. స్నేహితులు కలిసినప్పుడు స్మోకింగ్ తాగే అలవాటు ఉందా..?. అయితే ఇది మీకోసమే. స్మోకింగ్ చేయడం వలన గుండె జబ్బులు, ఊపిరితిత్తులకు సంబంధించిన పలు సమస్యలు ఉత్పన్నమవుతాయంటున్నారు శాస్త్రవేత్తలు.పొగతాగేవారు డిప్రెషన్ బారిన పడతారని వారు చేసిన అధ్యయానాల్లో తేలింది.యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్‌కు చెందిన పరిశోధకులు యూకేకు చెందిన 4,62,690 మందికి సంబంధించిన బయోబ్యాంక్ డేటాను విశ్లేషించి ఫలితాలను వెల్లడించారు. ఈ క్రమంలో వారు చెబుతున్న ప్రకారం.. స్మోకింగ్ వల్ల డిప్రెషన్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇతర మానసిక ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయంటున్నారు.సో స్మోకింగ్ తాగాలా.. వద్దా అనేది మీరే ఆలోచించుకోండి.