రాశీఖన్నా సొట్ట బుగ్గల సుందరీ. చూడగానే హార్ట్ బీట్ ఆగిపొయే అందం. నవ్వితే ముత్యాలు రాలతాయా అన్నట్లు ఉండే చిరునవ్వు. రాత్రిళ్లు యువతకు కలల్లోకి వచ్చే సోయగమున్న రాకుమారి.మరి ఇలాంటి రాకుమారి తెలుగు తెరపైకి తొలిసారిగా తన సొంత వాయిస్ తో మాటలు మాట్లాడుతుంటే వింటుంటే ఆ కిక్కే వేరుగా ఉంది కదా. అయితే అది కూడా త్వరలోనే నెరవేరబోతుంది.
ఇప్పటివరకు గళాన్ని అరువు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగు తెరపై తొలిసారిగా తన వాయిస్ ను వినిపించబోతున్నట్లు ఈ ముద్దుగుమ్మ తెలిపింది. వరల్డ్ ఫేమస్ లవర్ అనే మూవీలో ఈ సొట్ట బుగ్గల సుందరీ నటిస్తున్న సంగతి విదితమే.
విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమ్మడు హీరోయిన్ గా నటిస్తుంది. కెఎ వల్లభ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కెఎస్ రామారావు సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో తన డబ్బింగ్ గురించి రాశీఖన్నా” తొలిసారిగా నేను డబ్బింగ్ చెప్పబొతున్నాను. నేనే ఆశ్చర్యపోతున్నాను. మీరందరూ నా వాయిస్ వినేవరకు ఎదురుచూడలేకపోతున్నాను “అని తన ట్విట్టర్లో పోస్టు చేసింది.