చిన్న హీరోల పక్కన నటిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి స్టార్ హీరోల సరసన ఆడి పాడే స్థాయికెదిగిన అందాల బక్కపలచు ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. ఒకపక్క అందాలను ఆరబోస్తునే .. మరోవైపు చక్కని అభినయాన్ని ప్రదర్శిస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానానికి ఎదిగిన ఈ అందాల రాక్షసి. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఒక స్టార్ హీరోతో డేటింగ్ లో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి.టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరో రానాతో రకుల్ డేటింగ్ లో ఉన్నట్లు ఆ వార్తల సారాంశం. ఆ వార్తలపై ఈ ముద్దుగుమ్మ స్పందిస్తూ “రానాతో నేను డేటింగ్ లో ఉన్నట్లు వస్తోన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. మా మధ్య ఉన్నది కేవల స్నేహాం మాత్రమే. దీనికే డేటింగ్ అనో.. ఇంకా ఏదో అనో వార్తలు రాయకండి”అంటూ అమ్మడు ఘాటుగా స్పందించింది. అయితే ఏ హీరో హీరోయిన్ల మధ్య డేటింగ్, ప్రేమలకు నాంది స్నేహామే కదా అంటూ అమ్మడు చెప్పిన మాటలపై ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
