హిందూ ధర్మ ప్రచారయాత్రలో భాగంగా హైదరాబాద్‌లో పర్యటిస్తున్న విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారిని రాజేంద్రనగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ దర్శించుకుని ఆశీస్సులు పొందారు. నవంబర్ 6, బుధవారం సాయంత్రం ఫిల్మ్‌నగర్‌లోని సువర్ణభూమి శ్రీధర్ స్వగృహంలో జరిగిన పాదపూజల కార్యక్రమంలో శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారు పాల్గొన్నారు. స్వామివారిపై పూలవర్షం కురిపిస్తూ, అర్చకుల వేదమంత్రోచ్ఛారణల మధ్య పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి శ్రీధర్ కుటుంబసభ్యులు పూలమాలలు, పండ్లు సమర్పించి పాదపూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ శాసనసభ్యులు శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో స్వామివారి హిందూ ధర్మ ప్రచారయాత్ర రెండు తెలుగు రాష్ట్రాల సమన్వకర్త, దరువు ఎండీ సీహెచ్ కరణ్ రెడ్డి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.