తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ గా అలేరు అసెంబ్లీ నియోజకవర్గ అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగడి సునీతను ముఖ్యమంత్రి, గులాబీ దళపతి కేసీఆర్ ఇటీవల నియమించిన సంగతి విదితమే. తాజాగా ఎమ్మెల్యే సునీత ఈ రోజు తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వ విప్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ విప్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యే సునీతను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ ,ఇంద్రకరణ్ రెడ్డి,శ్రీనివాస్ గౌడ్ ఆమెను కలిసి పుష్పగుచ్చమిచ్చి అభినందనలు తెలిపారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ” ముఖ్యమంత్రి కేసీఆర్ నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బంగారు తెలంగాణ నిర్మాణంలో.. పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల ఫలాలు అందరికి అందేలా కృషి చేస్తానని” తెలిపారు.
