రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పని చేసిన కార్యకర్తలను గుర్తిస్తున్నాం. కార్యకర్తలకు తగిన భాద్యతలు అప్పగిస్తామని తెలిపారు. నేడు రాష్ట్రంలో గత ఖరీఫ్ సీజన్ లో కంటే ఈ ఖరీఫ్ సీజన్ లో ధాన్యం దిగుబడి పెరిగింది. దీనిని దృష్టిలో ఉంచుకొని గత నెల రోజుల ముందుగానే సీఎం కేసీఆర్.. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులను అప్రమత్తం చేసి రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని ఆదేశాలు జారీ చేసారు. ఏళ్లకు ఏళ్లు రాజకీయ అనుభవం ఉన్నవాళ్లు, మంత్రులుగా పని చేసి వాళ్లు అబద్దపు మాటలు మాట్లాడుతున్నారని ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు.
