స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమాతో హిట్ కొట్టిన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ మన ముందుకు రానున్నారు. సందేశాత్మక కమర్షియల్ సినిమాలు తీయడంలో దిట్ట అనిపించుకున్న ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిందట. ఈ సినిమాలో చిరంజీవి సరసన 13 సంవత్సరాల క్రితం మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన స్టాలిన్ సినిమాలో నటించిన తమిళ బ్యూటీ సీనియర్ నటి త్రిష నటించనున్నారట. దశాబ్దానికి పైగా గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ నటీనటులు ఇద్దరు స్క్రీన్ షేర్ చేసుకోవడం అప్పటి వీరికి మాత్రం ఎంతో సంతోషాన్ని ఇస్తోందట.
