జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు చేసిన రాజకీయం ఒక ఎత్తు అయితే ఇప్పుడు మాత్రం తాను అసలు సిసలైన అధికారపక్షానికి ఊపిరి ఆడనివ్వని ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై పోరాడే నాయకుడిగా తనను తాను ఎలివేట్ చేసుకునేందుకు కనిపించాలని తాపత్రయ పడుతున్నాడు. కానీ దీని వెనుక చంద్రబాబు నాయుడు అనే శక్తి ఉందన్న విషయం రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. ఐదేళ్లపాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి జరిగిన అన్యాయాన్ని, దుర్మార్గాన్ని కనీసం ప్రస్తావించని పవన్ కళ్యాణ్ ఇవాళ వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
అంటే ప్రభుత్వం గాని ఒక వ్యవస్థ గాని ఏర్పడడానికి కొద్ది సమయం కావాలి కానీ పవన్ దారుణంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా లాంగ్ మార్చ్ ముగిసిన తర్వాత విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ విలేకరులు ఓ ప్రశ్న ప్రశ్నించారు.. ఇసుక తీయడానికి ప్రస్తుతం ప్రభుత్వం కొంత ఇబ్బంది ఉందని చెప్తుంది కదా ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కదా.. ఇసుకను వరదల్లో తీసే సూచన ఏమైనా ఇస్తారా అంటే పవన్ దానికి దాటవేశారు.. ఈ ప్రశ్నకు సరిగ్గా సమాధానం చెప్పలేకపోయారు. అయితే నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించి ప్రజా సమస్యలపై పోరాడే ప్రజలు హర్షించే అవకాశం ఉంది కానీ ఈ విధంగా చేస్తే ప్రజల్లో మరింత చులకన అవుతానన్న విషయాన్ని పవన్ గమనించలేకపోతున్నారు.