తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ గుండు గీయించుకుంటానని సవాల్ విసిరారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ” తెలంగాణ ఆర్టీసీలో ప్రయివేట్ బస్సులను తీసుకోస్తానని చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్న ఐదేళ్ల వరకు ఎలాంటి బస్సు చార్జీలు పెంచకుండా ఉంటారా..?.
ఒకవేళ రాబోయే ఐదేళ్లల్లో బస్సు చార్జీలు పెంచకుండా ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే నేను గుండు గీయించుకుంటానని”ఆయన సవాల్ విసిరారు. నిన్న బుధవారం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ డిపో2 దగ్గర ఆర్టీసీ సమ్మె కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.