గడిచిన ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన చంద్రబాబుకి ఇంకా బుద్ధి రాలేదు. తన నియోజకవర్గంలోనే ఎంతో కష్టపడితేనే గాని గెలవలేకపోయాడు. కనీసం ఇన్ని సీట్లైనా గెలిచారు అంటే అది పెద్దాయన పై అభిమానం తోనే అని చెప్పాలి. 2014 ఎన్నికల్లో కూడా అందరు కలిసి మద్దతు ఇస్తేనే గెలిచారు తప్ప బాబు చేసింది ఏమీ లేదు. ఇచ్చిన అధికారాన్ని మంచికి ఉపయోగించకుండా చెడుకు, సొంత పనులకే చేసుకున్నాడు తప్ప రాష్ట్రానికి మాత్రం ఏమీ చెయ్యలేకపోయారు.అందుకే ప్రజలు ఈసారి సరైన బుద్ధి చెప్పారు. దీనికి తోడు పవన్ కళ్యాణ్ ఒకరు. ఏం మాట్లాడతారో ఆయనకే తెలియట్లేదు. దీనిపై స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు పై విరుచుపడ్డారు.”ఒక్క సీటు వచ్చిన అనామతు పార్టీ అధ్యక్షుడిని 23 మంది ఎమ్మెల్యేలున్న మాస్టర్ మ్యానిపులేటర్ క్రేన్ పెట్టి పైకెత్తుతున్నాడు. అందనంత ఎత్తులో ఉన్న సీఎం జగన్ గారిపై పిడకలు వేయించే ప్రయత్నం చేస్తే అది వాళ్ల ముఖాలపైనే పడుతుందని” క్లారిటీ ఇచ్చాడు.