వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడ్డారు. చంద్రబాబు చేస్తున్న పనులకు, చేష్టలకు మండిపడుతున్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు కనీస సౌకర్యం కల్పించలేకపోయారు, ఇప్పుడు జగన్ చేస్తున్న మంచిపనులకు అడ్డం వస్తున్నారని మండిపడ్డారు. ఇదంతా పక్కన పెడితే “అప్పట్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే తిన్నది అరక్క చస్తున్నారని నీచంగా వ్యాఖ్యానించాడు. మృతుల కుటుంబాలకు పరిహారం ఇస్తే డబ్బు కోసం ప్రాణాలు తీసుకుంటారని హేళన చేశాడు. ఇప్పుడు ఎవరో వ్యక్తిగత కారణాలతో చనిపోతే 25 లక్షల కాంపెన్షేషన్ ఇవ్వాలంటున్నాడు. నోరా తాటిమట్టా బాబూ? అని ప్రశ్నించారు. చంద్రబాబు మరీ ఇంత రాజకీయ పిచ్చా అని అన్నారు. జగన్ వచ్చాక రాష్ట్రం చాలా సంతోషంగా ఉందని ఇలాంటి సమయంలో విష ప్రయత్నాలు చేసి ఏం సాధిస్తావ్ అని అన్నారు.
అప్పట్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే తిన్నది అరక్క చస్తున్నారని నీచంగా వ్యాఖ్యానించాడు. మృతుల కుటుంబాలకు పరిహారం ఇస్తే డబ్బు కోసం ప్రాణాలు తీసుకుంటారని హేళన చేశాడు. ఇప్పుడు ఎవరో వ్యక్తిగత కారణాలతో చనిపోతే 25 లక్షల కాంపెన్షేషన్ ఇవ్వాలంటున్నాడు. నోరా తాటిమట్టా బాబూ?
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 7, 2019