టీమిండియా డేరింగ్ డాషింగ్ బ్యాట్స్ మెన్ ,పరుగుల మిషన్ గన్ రోహిత్ శర్మ మరో రికార్డుకు చేరువలో ఉన్నారు. బంగ్లాదేశ్ తో జరగనున్న రెండో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ తో కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకోనున్నాడు.
ఈ మ్యాచ్ రోహిత్ కు వందో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ . ఈ ఘనత సాధించిన మొట్ట మొదటి టీమిండియా బ్యాట్స్ మెన్ గా రోహిత్ శర్మ రికార్డులోకెక్కనున్నాడు.ఓవరాల్ గా చూస్తే పాకిస్థాన్ ఆటగాడు షోయబ్ మాలిక్ (111)తర్వాత అత్యధిక ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లు ఆడిన ఆటగాడుగా రోహిత్ చరిత్రకెక్కనున్నాడు.
అయితే ట్వంటీలో అత్యధిక పరుగులు (2,452)చేసిన ఆటగాడిగా రోహిత్ మరో రికార్డును లిఖించాడు. 136.67 స్ట్రయిక్ రేట్ తో నాలుగు సెంచురీలు.. 17 ఆర్ధ శతకాలు సాధించిన రోహిత్ 2007లో జరిగిన వరల్డ్ కప్ తో ట్వంటీలో అరంగేట్రం చేశాడు.