తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ డా.ఎర్రోళ్ల శ్రీనివాస్ నేతృత్వంలోని కమిషన్ డీడీ లావణ్య బృందం కర్ణాటక రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా కర్ణాటక రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ మరియు అధికారులతో ఎర్రోళ్ల బృందం సమావేశమై రాష్ట్ర కమిషన్ పనితీరు తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు . అనంతరం కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల మాట్లాడుతూ”తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎస్సీ,ఎస్టీ వర్గాల అభ్యున్నతికై.. ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమాభివృద్ధి పథకాలు అందాలనే లక్ష్యంతోనే ముందుకు పోతుంది ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం.
ఆయా వర్గాలకు అండగా ఉండాలనే లక్ష్యంతోనే ఎస్సీ ఎస్టీ కమిషన్ ను “ఏర్పాటు చేశారన్నారు.ఎర్రోళ్ల మాట్లాడుతూ” కమిషన్ ఏర్పడిన నాటి నుండి నేటి వరకు మొత్తం ఆరు వేలకుపైగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కమిషన్ దృష్టికి వస్తే సంబంధిత అధికారుల నేతృత్వంలో అన్ని కేసులను పరిష్కరించాము. ఈ కేసులకు సంబంధించి దాదాపు 43 కోట్లకుపైగా పరిహారం అందించామని తెలిపారు.
అనంతరం కర్ణాటక కమిషన్ అధికారులు మాట్లాడుతూ” కమిషన్ చైర్మన్ గా తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీల కోసం బాగా పని చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మీరు చైర్మన్ గా ఎస్సీ,ఎస్టీల అభ్యున్నతికై చేస్తున్న కృషి అమోఘం. మీరు చూడటానికి యువకుడిలా కన్పిస్తున్నారు. మీకు పెళ్ళి కాకపోతే కర్ణాటక అమ్మాయిని పెళ్ళి చేసుకొండి. ఇక్కడ ఉన్న ఎస్సీ,ఎస్టీల అభ్యున్నతికై పని చేయండి అంటూ కమిషన్ అధికారులు అనడంతో అవాక్కు అవ్వడం ఎర్రోళ్ల వంతైంది . దీంతో ఎర్రోళ్ల స్పందిస్తూ నాకు పెళ్ళి అయింది. పిల్లలు కూడా ఉన్నారు అని అనడంతో ఆ సమావేశంలో నవ్వులు విరిశాయి.