మంగళవారం నాడు నటుడు విజయ్ సేతుపతి ఇంటిని చిరు వ్యాపారులు చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. ఇదంతా ఎందుకు అనే విషయానికి వస్తే విజయ్ ఇటీవలే మండి వ్యాపార ప్రకటనలో నటించారు. ఆన్ లైన్ బిజినెస్ వల్ల చిరు వ్యాపారులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారని, ఇలాంటి యాడ్స్ లో విజయ్ సేతుపతి నటించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయంలో ఇది వరకే ఇంటిని ముట్టడిస్తామని చెప్పినట్టు సమాచారం. దాంతో ఎక్కువ మంది చిరు వ్యాపారస్తులు వచ్చి ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేసారు. ఆన్ లైన్ లో ప్రచారం చేయడం సరికాదని అన్నారు. అయితే ఇలా జరుగుతాదని ముందే తెలియడంతో ఇంటి దగ్గర పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి వారిని ఒక చోటకి తరలించారు.