సచిన్ టెండుల్కర్..ఈ పేరు చెబితే చిన్న పిల్లవాడు కూడా క్రికెట్ అనే పదమే స్మరిస్తాడు. ఎందుకంటే క్రికెట్ అనే ఆటలో సచిన్ భారత్ కు దొరికిన ఒక ఆణిముత్యమని చెప్పాలి. అతిచిన్న వయసులోనే ఇంటర్నేషనల్ మ్యాచ్ లో అడుగుపెట్టిన సచిన్ అప్పుడే ఎన్నో గణాంకాలు తన పేరిట రాసుకున్నాడు. పొట్టోడు ఎప్పుడూ గట్టివాడే అని నిరూపించాడు. వేరెవ్వరు సాధించలేని ఫీట్లు సచిన్ సాధించాడు. ఆటలోనే కాదు మనిషి పరంగా ఆయనకు ఎవరూ సాటిరారని చెప్పాలి. అలాంటి వ్యక్తికి ఈరోజు చాలా స్పెషల్ డే అని చెప్పాలి. ఎందుకంటే ఇదేరోజున వన్డేల్లో 17వేల పరుగులు సాధించిన మొదటి ఆటగాడికి చరిత్రకెక్కాడు. అంతేకాకుండా ఆ రోజు ఆస్ట్రేలియా పై ఏకంగా 175 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీనికి వేదికగా నిలిచింది హైదరాబాద్ స్టేడియం నే.
