తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు రమణదీక్షితులు కు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సరిదిద్దుతున్నారు. శ్రీవారికి సంబంధించి అప్పట్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఆగమ శాస్త్రానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారంటూ రమణ దీక్షితులు బాహాటంగానే విమర్శలు గుప్పించారు. అనంతరం టీడీపీ ప్రభుత్వం రమణదీక్షితులు వ్యవహారం పై కక్ష గట్టి ఆయనను టీటీడీ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఆయన ఇంటిని కూడా ఖాళీ చేయాలంటూ నోటీసు అందించారు. ఈ క్రమంలో అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి రమణదీక్షితులు తమ సమస్యలను చెప్పుకున్నారు. ఈ క్రమంలో రమణదీక్షితులు కు తమ ప్రభుత్వంలో న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన జగన్ ఇప్పుడు మళ్లీ టీటీడీలోకి రమణదీక్షితులు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల వేదపండితులు, టీటీడీ పెద్దలు, పురోహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.