టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మోస్ట్ సీనియర్ నటుడు ప్రముఖ దర్శక నిర్మాత అయిన గొల్లపూడి మారుతిరావు అస్వస్థతకు గురయ్యారు. దీంతో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గొల్లపూడిని ఆయన కుటుంబ సభ్యులు తమిళ నాడు రాష్ట్రంలోని చెన్నైలోని ఒక ప్రముఖ ఆసుపత్రికి చేర్చారు.
ప్రస్తుతం చెన్నై పర్యటనలో ఉన్న ఉప రాష్ట్ర పతి ముప్పవరపు వెంకయ్యనాయుడు నిన్న మంగళవారం ఆసుపత్రికెళ్ళి గొల్లపూడి మారుతిరావును పరామర్శించారు. అక్కడున్న వైద్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితులు.. అందుతున్న వైద్య చికిత్సల గురించి అడిగి తెలుసుకున్నారు.
అనంతరం గొల్లపూడికి సరైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.గొల్లపూడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. గొల్లపూడి పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.