జూలై 21న అట్టహాసంగా ప్రారంభమైన బిగ్‌బాస్-3 నవంబర్ 3న అంతే ఘనంగా ముగిసింది. సీజన్ చివరి రోజుల్లో అనూహ్యంగా పుంజుకున్న రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచాడు. టైటిల్ గెలుస్తానని ధీమా వ్యక్తం చేసిన శ్రీముఖి విజయానికి అడుగు దూరంలోనే ఆగిపోయింది.అయితే సీజన్ 3 విన్నర్ గా రాహుల్ గెలిచాడు. అలాగే పునర్నవి మనసు కూడా గెలుచుకున్నాడు. బిగ్ బాస్ ఇంట్లో మొదలైన వీళ్ళ స్నేహం.. ప్రేమగా మారింది. ఈ ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చేందుకు ఇరు పెద్దలు కూడా రెడీ అయ్యారు. పునర్నవి, రాహుల్‌లు ఓకే అంటే పెళ్లి చేసి ఓ ఇంటి వాళ్లను చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదంటున్నారు రాహుల్ పేరెంట్స్. రాహుల్ బిగ్ బాస్ విజేతగా అవతరించిన తరువాత పున్నూకి గ్రాండ్ పార్టీ ఇచ్చాడు రాహుల్. ఈ సందర్భంగా రాహుల్ పేరెంట్స్ వీరి పెళ్లిపై ఓపెన్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్‌లో ఏం జరిగిందన్నది వాళ్లకు మాత్రమే తెలుసు. ఒకవేళ వాళ్లు నిజంగా లవ్ చేసుకుని ఉంటే మేం కాదనం అని తెలిపారు. మరి వీరు పెళ్లి పీటలు ఎక్కుతారా లేదా అనేది చూడాలి .
