పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటు అందంతో అటు నటనతో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న ముద్దుగుమ్మ. తన అందచందాలతో కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న అందాల రాక్షసి.
ఇలాంటి రాక్షసి త్వరలోనే మరో స్టార్ హీరోతో రోమాన్స్ చేయనున్నది వార్తలు వస్తోన్నాయి. అది కూడా రీయల్ గా కాదు రీల్ లో. జనసేన అధినేత పవన్ కళ్యాన్ తిరిగి మూవీల్లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి విదితమే.
ఇందులో భాగంగా పవన్ పింక్ మూవీ రీమేక్ తో ముఖానికి రంగులేసుకోబోతున్నాడు అని ఫిల్మ్ నగర్లో వార్తలు గుప్పమంటున్నాయి. పింక్ లో తాప్సీ పోషించిన పాత్రలో పూజా నటించనున్నది అని సమాచారం. శ్రీరామ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీని దిల్ రాజ్,బోనీ కపూర్ నిర్మించనున్నారు.