దివంగత నేత నందమూరి తారక రామారావు భార్య లక్ష్మీపార్వతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక పదవి అప్పగించారు. ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా లక్ష్మీపార్వతిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లక్ష్మీపార్వతి వైసీపీలో కీలకంగా వ్యవహరించారు. ఆమె చంద్రబాబు మీద విమర్శల దాడి చేసేవారు. లక్ష్మీపార్వతి గతంలో సొంత పార్టీ పెట్టారు. ఆ తర్వాత క్రియాశీల రాజకీయాలకు కొన్నాళ్లు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన వెంట నడిచారు. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆమెకు జగన్ ఎలాంటి పదవి ఇస్తారా? అని రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు బుధవారం నియామక ఉత్తర్వులు జారీ చేసింది.
