Home / ANDHRAPRADESH / ఎల్లోమీడియాధిపతికి కాపు ఉద్యమనేత ముద్రగడ ఘాటైన లేఖ..!

ఎల్లోమీడియాధిపతికి కాపు ఉద్యమనేత ముద్రగడ ఘాటైన లేఖ..!

టీడీపీ అధినేత చంద్రబాబు‌కు దశాబ్దాలుగా వెలుగునిచ్చే ఓ ఎల్లో మీడియా ఛానల్‌‌ను, పత్రికను ఇక చూడదల్చుకోలేదంటూ..కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఇసుక కొరతపై ఏపీ సీఎం జగన్‌కు ముద్రగడ ఓ లేఖ రాశారు. అయితే బాబుగారికి “కమ్మ”గా కొమ్ము కాస్తూ కొన్ని వర్గాలచే చంద్రజ్యోతిగా పిలువబడే ఓ ఎల్లోమీడియా ఛానల్ కమ్ పత్రిక  సీఎం జగన్‌పై దుమ్మెత్తిపోసినట్లు తన లేఖను వక్రీకరించిందని. ముద్రగడ ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సదరు ఎల్లోమీడియాధిపతికి ముద్రగడ స్వయంగా లేఖ రాశారు. చేతిలో పెన్నూ, కాగితాలు ఉన్నాయి కనుక..మీ ఇష్టారీతిన రాయడం ఏంటని అసహనం వ్యక్తం చేశారు. ముద్రగడ లేఖ యధాతథంగా..

నమస్కారములు..!

‘04-11-2019వ తేదీన ఇసుక విషయమై సలహా ఇస్తూ ముఖ్యమంత్రి గారికి లేఖ రాసి పత్రికలకు విడుదల చేశాను. నేనేమి మీలాగ అపర మేధావిని కాను. రాష్ట్రంలో ఇసుక కోసం ప్రజలు పడుతున్న బాధలు చూసి ఇసుక పాలసీ పక్కాగా రూపొందించే వరకు ప్రజలకు ఉచితంగా ఇసుక సరఫరా చేయండి అని లేఖలో రాసాను. మీ పత్రికలో ఆ వార్తను ముక్కలు చేసి ముఖ్యమైన సలహాను రాయకుండా దాచడం ఎంత వరకు న్యాయమని అడుగుతున్నాను. నేను లిఖిత పూర్వకంగా ఇచ్చిన సలహాను రాష్ట్రంలోనే కాదు. దేశంలో ఉన్న గౌరవ మేధావులను తప్పు అని చెప్పమనండి బేషరతుగా క్షమాపణ చెబుతాను. నా సలహాను ఎందుకు పత్రికలో రాయకూడదని, రాయొద్దని హుకుం జారీ చేసారు. ప్రభుత్వాల వల్లన నష్టం జరిగినప్పుడు లొల్లి పెట్టడానికి ప్రింటు, ఎలక్ట్రానిక్‌ మీడియా మీకు ఉన్నాయి. మీ స్వేచ్చకు సంకెళ్లు వేయకూడదు. మాలాంటి వారికి అలాంటివి జరిగినప్పుడు మా బాధను ఎక్కడ చెప్పుకున్నా న్యాయం జరగదు. మీ చేతిలో పెన్ను, కాగితాలు ఉన్నాయి కనుక మీ ఇష్టం. దయచేసి ఇక నుండి నా వార్తలు మీ ప్రింటు, ఎలక్ట్రానిక్‌ చానెల్‌లో చూపకండి. ఇక నుంచి మీ చానెల్‌ గాని, మీ పత్రిక గాని చూడదల్చుకోలేదు’ అంటూ ముద్రగడ సదరు ఎల్లోమీడియాధిపతికి రాసిన లేఖలో ఘాటుగా స్పందించారు. దీంతో ఇసుక విషయంలో సీఎం జగన్‌‌కు ముద్రగడ ఘాటు లేఖ అంటూ పచ్చపత్రిక రాసిన కథనంలో జగన్ తీసుకువచ్చిన ఇసుకపాలసీపై సమాజంలోని మేధావుల నుండి సామాన్యల వరకు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారంటూ రాశారు. అయితే ఉచిత ఇసుక ఇవ్వండి అన్న ముద్రగడ సూచనలను మాత్రం పచ్చ పత్రిక ప్రస్తావించలేదు. ఈ కథనంపై తీవ్ర విమర‌్శలు వచ్చిన నేపథ్యంలో ముద్రగడ స్పందించారు. కావాలనే ఉద్దేశపూర్వకంగా తన లేఖను వక్రీకరించారని భావించిన ఆయన ఈ మేరకు సదరు పచ్చపత్రికాధిపతిని ఆక్షేపిస్తూ ఘాటుగా లేఖ రాశారు. దీంతో ముద్రగడ పేరుతో సీఎం జగన్ని బద్నాం చేయాలనుకున్న ఎల్లోమీడియాధిపతి కుట్ర బయటపడినట్లైంది. మొత్తంగా పచ్చపత్రికాధిపతికి ముద్రగడ రాసిన ఘాటైన లేఖ ఇప్పుడు ఏపీ రాజకీయ, మీడియా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat