ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో ఎక్కువ విమర్శలకు గురైన సమస్య ఏదైనా ఉంది అంటే అది నో బాల్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ ఒక్క తప్పు వల్ల టైటిల్ విజేతలే మారిపోతారు. దీనికి సంబంధించి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ప్రత్యేకించి ఈ నో బాల్ వీక్షించడానికి ఒక అంపైర్ ను పెట్టనుంది. ఫీల్డ్ అంపైర్లు, థర్డ్ అంపైర్ తో సహా ఈయన కూడా ఉంటారని కౌన్సిల్ హెడ్ చెప్పడం జరిగింది. అయితే ఐపీఎల్ కు ఇంకా సమయం ఉన్నందుకు ఈ కొత్త రూల్ ని ముందు బయట మ్యాచ్ లకు వర్తిస్తుందని. రంజీ ట్రోఫీలో ఇది పెడతామని అన్నారు. అలా చేయడం వల్ల తప్పులకు ఆస్కారం ఉండదని భావిస్తున్నారు.
