ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షనాయకుడిగా ఉన్న సమయంలో చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు నేటికి సరిగ్గా రెండేళ్ళు. మంచి దృడ సంకల్పంతో తన తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వద్ద 2017 నవంబర్ 6న తొలిఅడుగు వేసిన ఆయన కోట్లాది మంది ప్రజల మధ్య ఉంది వారి హృదయాలను స్పృశిస్తూ చివరికి 2019 జనవరి 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగించారు. రాష్ట్రం మొత్తంలో 13జిల్లాలలో 134 నియోజకవర్గాలు, 231 మండలాలు, 2,516 గ్రామాల్లో 341 రోజుల పాటు 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసారు. ఇందులో భాగంగా ప్రతీ ఊరు, ప్రతీ జిల్లాలో ప్రజల కష్టాలు విన్న జగన్ మీకు నేనున్నానంటూ హామీ ఇచ్చాడు. జగన్ అడుగుపెట్టిన ప్రతీచోట ప్రజలు ఘన స్వాగతం పలికారు. తమ కష్టాలను ఒక్కొక్కరుగా నేరుగా ఆయనకు చెప్పుకున్నారు. ప్రజల అందరి కష్టాలు విన్న జగన్ చలించిపోయారు. దాంతో నవరత్నాలు పేరు తో ప్రతీఒక్కరికి న్యాయం చెయ్యాలని, దానికి తగ్గట్టుగానే అందరికి హామీలు ఇచ్చారు. ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుండి కొత్త పథకాలు ప్రవేశపెట్టి వారిని ఆదుకున్నాడు. ఇప్పుడు ప్రజల హృదయాల్లో దేవుడయ్యాడు. ఇంకా మునుమ్ముందు ఇంకెన్నో చెయ్యాలని ఈమేరకు నిరంతరం కష్టపడుతున్నారు.