తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీశ్ రావు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. ఈ లేఖలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఐజీఎస్టీ నిధుల మొత్తాన్ని వివరించారు.
గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి పరిహారం అందలేదని మంత్రి హారీష్ రావు పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు రాసిన లేఖలో మంత్రి తన్నీరు హారీష్ రావు విజ్ఞప్తి చేశారు.