ఏపీ అధికార వైసీపీ నేత,మంత్రి బొత్స సత్యనారాయణ పై మాజీ మంత్రి,టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ” ఏపీ రాజధాని ప్రాంతమైన అమరావతిలో ఒక్క ఇటుక కూడా పడలేదు ..
అంతా గ్రాఫిక్స్ అంటూ మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ ఒక జోకర్ లా కన్పిస్తున్నాడు అని విమర్శించారు. అమరావతి ప్రాంతంలో రూ.30 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు చేసిన వైసీపీ నేతలతో తాను బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు.
రాజధాని నిర్మాణంలో లేని అవినీతిపై కమిటీ వేస్తున్న ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం పిచ్చి తుగ్లక్ ప్రభుత్వమంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.