Home / Uncategorized / మహిళలకు అది చాలా అవసరం

మహిళలకు అది చాలా అవసరం

సాయిపల్లవి చూడగానే మన ఇంట్లోని అమ్మాయిలా.. పక్కింట్లో ఉండే పదహారణాల తెలుగు అమ్మాయిలా నేచురల్ బ్యూటీతో తెలుగు సినిమా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్న నేచూరల్ బ్యూటీ .వరుస విజయాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న సాయి పల్లవి తాజాగా వి ది విమెన్ అనే కార్యక్రమంలో పాల్గొన్నది. ఈ కార్యక్రమంలో అమ్మడు మాట్లాడుతూ పలు అంశాల గురించి తనదైన శైలీలో స్పందించింది.

ఈ సందర్భంగా సాయి పల్లవి మాట్లాడుతూ” నా చిన్నతనం నుంచి హీరోయిన్ అంటే మత్తెక్కించే అందాలు.. చూడగానే కుర్రకారు గుండెలు జారిపోయే అందాలుండాలని..సొగసైన అందంతో పాటు చక్కని అభినయం ఉండాలి అని అనుకునే దానిని” అని అన్నారు. కానీ ప్రేమమ్ మూవీలో హీరోయిన్ గా ఎంట్రీచ్చిన తనను స్వీకరిస్తారో లేదో.. విమర్షలు చేస్తారని తెగ భయపడ్డాను.

కానీ లోలోపల మాత్రం చక్కని నటన.. మంచితనం ఉంటే చాలు ఇవేమి అవసరం లేదని నమ్మేదాన్నే. అదే నిజమైంది. ప్రేమమ్ మూవీలో నన్ను ఆదరించి తమ గుండెల్లో పెట్టుకున్నారు. ఇక తెలుగు సినిమా ప్రేక్షకుల గురించి చెప్పనక్కర్లేదు. వీళ్లు అయితే ఏకంగా నాకు తమ గుండెల్లో గుడులు కట్టారు. అందుకే మహిళలకు ఆత్మాభిమానం.. మంచితనం ఉంటే చాలు ప్రపంచాన్ని సైతం జయించవచ్చు అని “అమ్మడు చెప్పుకుంటూ వచ్చింది

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat