తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ శివారు అబ్దుల్ మెట్ పూర్ ఎమ్మార్వో విజయారెడ్డి సంఘటనపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు స్పందించారు.
దీనిపై మంత్రి హారీష్ రావు తన అధికారక ట్విట్టర్ ఖాతాలో పోస్టులో స్పందిస్తూ”అబ్దుల్లాపూర్ మెట్ MRO శ్రీమతి విజయారెడ్డి గారిపై అత్యంత దుర్మార్గంగా, పాశవికంగా జరిపిన హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాను.
ఇది హేయమైన చర్య. ఈ సంఘటన నన్ను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. విజయ గారి మృతికి సంతాపాన్ని తెలుపుతున్నా. వారి కుటుంబసభ్యులకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుంది”అని తెలిపారు.