తెలంగాణ రాజధాని మహానగరం హైదరాబాద్ శివారు అబ్దుల్ మెట్ పూర్ ఎమ్మార్వో విజయారెడ్డి తనకు పట్టా పాసు పుస్తకం ఇవ్వడం లేదని సురేష్ అనే కౌలుదారు రైతు నిన్న సోమవారం పెట్రోల్ దాడికి దిగిన సంఘటన సంచలనం సృష్టించిన సంగతి విదితమే. ఈ ఘటనలో ఎమ్మార్వో విజయారెడ్డి అక్కడిక్కడే మృతి చెందింది. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో తీవ్రంగా గాయపడిన నిందితుడు సురేష్ అరవై ఐదు శాతం గాయాలతో ఉస్మానీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై స్పందించిన వైద్యులు మాట్లాడుతూ” డెబ్బై రెండు గంటలు గడిస్తే కానీ ఏమి చెప్పలేమని ” చెప్పినట్లు సమాచారం. అయితే మరోవైపు తన పాసు పుస్తకం గురించి ఎమ్మార్వో పై దాడికి దిగినట్లు నిందితుడు పోలీసు విచారణలో తెలిపారు.