తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ శివారులోని అబ్దుల్ పూర్ మెట్ఎమ్మార్వో విజయారెడ్డిపై తమకు పాసు పుస్తకం ఇవ్వడంలేదని సురేష్ అనే నిందితుడు పెట్రోల్ దాడికి దిగిన సంగతి విదితమే.
ఈ దాడిలో విజయారెడ్డి సజీవదహనం కాగా నలుగురుకి తీవ్ర గాయాలయ్యాయి.అయితే ఈ హత్యకేసులో నిందితుడైన సురేష్ నగరంలోని ఉస్మానీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సురేష్ నుంచి పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు.
పోలీసులు రికార్డు చేసిన సమాచారం మేరకు సురేష్ మాట్లాడుతూ” పట్టా కోసం తాను ఎమ్మార్వో ను చాలా సార్లు తిరిగాను. అయిన కానీ పట్టించుకోలేదు. కోర్టు కేసులు ,జాయింట్ కలెక్టర్ ఆదేశాలుండటంతో తానేమి చేయలేనని” విజయారెడ్డి తేల్చి చెప్పారు.
దీంతో పెట్రోల్ పోసి నిప్పు అంటించినట్లు వాంగ్మూలం ఇచ్చాడు అని పోలీసులు చెబుతున్నారు. అంతే కాకుండా తాను కూడా ఆత్మహత్యకు పాల్పడినట్లు సురేష్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపాడు.