తమిళనాడు రాష్ట్ర దివంగత సీఎం,అన్నాడీఎంకే అధినేత జయలలిత స్నేహితురాలు.. ఆ పార్టీ నేత శశికళ ఆస్తులను ఆదాయపు పన్ను అధికారులు జప్తు చేశారు. శశికళకు చెందిన సుమారు మొత్తం రూ.1600 కోట్ల విలువ చేసే ఆస్తులను పది కంపెనీల్లో సోదాలు నిర్వహించి బినామీ చట్టం కింద అటాచ్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు.గత రెండేళ్ళుగా బెంగుళూరులోని అగ్రహారం జైలులో శశికళ శిక్షను అనుభవిస్తున్న సంగతి విదితమే
