కర్ణాటక రాష్ట్రంలో ఆర్టీసీ సంస్థ తీవ్ర నష్టాల్లో ఉంది. దీంతో ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందని తెలుస్తోంది. ఈ అంశం గురించి ప్రభుత్వం ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు కూడా జరిపినట్లు సమాచారం.
ఒక్క ఆర్టీసీనే కాకుండా దీంతో పాటు మరో ఇరవై మూడు ప్రభుత్వ రంగ సంస్థలు కూడా నష్టాల బాటలో ఉన్నాయి. వీటిని కూడా వదిలించుకునేందుకు అక్కడి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోన్నట్లు సమాచారం.
తెలంగాణలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని తెగ ఆరాట పడుతున్న ఇక్కడి బీజేపీ నేతలు దీనికి ఏమి సమాధానం చెబుతారో మరి అంటూ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.