టీడీపీ అధినేత చంద్రబాబుపై సినీనటులు మోహన్‌బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ తరుపున ప్రచారం చేసిన మోహన్‌బాబు చంద్రబాబు నైజాన్ని, కుటిల రాజకీయాలను తీవ్రంగా ఎండగట్టారు. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోహన్‌బాబు రాజకీయంగా సైలెంట్ అయిపోయారు. కాగా రెండు రోజుల క్రితం ఓ సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు మోహన్‌బాబు క్రమ శిక్షణ లేని వ్యక్తి అంటూ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. బాబు వ్యాఖ్యలపై మోహన్‌బాబు మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా చెలరేగిపోయారు. చంద్రబాబు ఎలక్షన్స్ అయిపోయాయి, ఎవరు దారిన వాళ్ళు ఉన్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు.అంతా ప్రశాంత వాతావరణం. ఈ సమయంలో మళ్ళీ ఇలా నా మనసును ఇబ్బంది పెడతావు అనుకోలేదని మోహన్‌బాబు అన్నారు. . రెండు రోజుల క్రితం క్రమశిక్షణ లేని వ్యక్తి మోహన్ బాబు అని నీ నోటి నుండి రావడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. నా మనసును గాయపరిచావు. అన్న యన్. టి. ఆర్, అక్కినేని నాగేశ్వరరావు గారు మరియు నా సినిమా పరిశ్రమ క్రమశిక్షణ కలిగిన వ్యక్తి మోహన్ బాబు అని ఎన్నో సందర్భాల్లో చెప్పారు, చెప్తుంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. క్రమశిక్షణ అనే పదానికి, స్నేహం అనే పదానికి అర్థం తెలియని వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది నువ్వు ఒక్కడివే. దయ చేసి ఏ సందర్భంలోనూ నా పేరుకు భంగం కలిగించేటట్టు ప్రస్తావించకు. అది నీకు నాకు మంచిది. ఎక్కడైనా, ఎప్పుడైనా ఎదురు పడితే సరదాగా మాట్లాడుకుందాం, అదీ నీకు ఇష్టమైతే. ఉంటా! అంటూ మోహన్‌బాబు చంద్రబాబుపై వరుస ట్వీట్లతో కౌంటర్ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఒకప్పుడు చంద్రబాబు, మోహన్‌బాబు మంచి స్నేహితులు..ఆ స్నేహభావంతోనే చెప్పుడు మాటలు నమ్మి..దేవుడిలా కొలిచే ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచే సమయంలో మోహన్‌బాబు కూడా చంద్రబాబు వెంటే నిలిచాడు. అయితే బాబు వాడుకుని వదిలేసే బుద్ధిని అర్థం చేసుకున్న మోహన్‌బాబు క్రమంగా టీడీపీకి దూరమయ్యారు. వైయస్ కుటుంబంతో బంధుత్వం దృష్ట్యా ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. ఇది మనసులో పెట్టుకున్న చంద్రబాబు..మోహన్‌బాబు క్రమశిక్షణ లేని వ్యక్తి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాబు వ్యాఖ్యలకు మోహన్‌బాబు కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు.. స్నేహానికి, క్రమశిక్షణ అనే పదాలకు అర్థం తెలియని వ్యక్తి దేశంలో ఎవరైనా ఉన్నారంటే..చంద్రబాబే అని మోహన్‌బాబు ధీటుగా కౌంటర్ ఇచ్చారు. ఇద్దరు బాబుల మధ్య సంవాదం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.
