తెలంగాణ రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన ఇందిరానగర్ కాలనీలో నివాసముంటున్న దికొండ అశోక్-లహరి దంపతులకు చెందిన ఏడో తరగతి చదువుతున్న మేఘన అనే విద్యార్థిని గత కొంతకాలంగా వెన్నుముక సమస్యతో బాధపడుతున్న విషయాన్ని .. వెన్నుముక సమస్య ఉంది. ఆపరేషన్ కు రూ. రెండు లక్షలు ఖర్చు అవుతుంది.
అంతగా స్థోమత లేని ఆశోక్-లహరి దంపతులు స్థానిక ప్రజాప్రతినిధులు అయిన ఎంపీపీ పడిగెల మానస-రాజు దంపతులను ఆశ్రయించారు. ఈ విషయాన్ని మంత్రి కేటీ రామారావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే స్పందించిన మంత్రి కేటీ రామారావు సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ. లక్ష ఎల్వోసీ మంజూరు చేయించారు.
అక్టోబర్ 17న మేఘన కు నిమ్స్ లో ఆపరేషన్ నిర్వహించారు. దాదాపు ఇరవై రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న మేఘనను విజయవంతం కావడంతో అక్టోబర్ ఇరవై ఏడో తారీఖున ఇంటికి పంపించారు. మూడు నెలలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారు.ఆపరేషన్ విజయవంతం కావడంతో మంత్రి కేటీఆర్ కు మేఘన తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.