ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా నిరుద్యోగులకు ఇది నిజంగా శుభవార్తే..సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జెనెరేషన్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (సిడాప్) ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గం పరిధిలో ఈ నెల 7 న తిరువూరు జడ్పీ హై స్కూల్ లో చేపట్టనున్న మెగా జాబ్ మేళా బ్రోచర్ ను మంగళవారం ఆవిష్కరించారు. జాబ్ మేళాకు సంబంధించిన బ్రోచర్ ను తిరువూరు మండల పరిషత్ కార్యాలయంలో ఆవిష్కరించారు. నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నాగేశ్వరరావు, ఎన్.కిరణ్ కుమార్, మల్లెల పిఏసీఎస్ చైర్మన్ కలకొండ రవికుమార్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు పరసా శ్రీనివాసరావు, బండి రవి, బర్రా శ్రీను, కేశవులు, డిపి ట్రైనర్ లక్ష్మీ రవిరాజ్, తదితరులు పాల్గన్నారు.
