తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీ రామారావు రాజధాని మహానగరం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొనున్నారు.
ఇందులో భాగంగా స్థానిక మంత్రి శ్రీనివాస్ యాదవ్,నగర మేయర్ బొంతు రామ్మోహాన్ లతో కలిసి మంత్రి కేటీ రామారావు ఈ రోజు మంగళవారం మీర్ పేట్-హెచ్ బీ కాలనీ డివిజన్ లో కృష్ణానగర్ కాలనీ నుంచి రాజరాజేశ్వరీ ఫంక్షన్ హాల్ వరకు వర్షపు నీటి డ్రైనేజీ నిర్మాణపనులకు శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం.