తన భూములకు సంబంధించిన పట్టా పాసు పుస్తకం ఇవ్వకుండా పలు సార్లు ఆఫీసుల చుట్టూ.. తన చుట్టూ తిప్పించుకుంటుందనే నెపంతో సురేష్ అనే నిందితుడు అబ్దుల్ పూర్ మెట్ ఎమ్మార్వో విజయారెడ్డిపై పెట్రోల్ దాడికి దిగిన సంగతి విదితమే.
ఈ దాడిలో ఎమ్మార్వో విజయారెడ్డి అక్కడిక్కడే మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 85% గాయాలతో ఎమ్మార్వో డ్రైవర్ గురునాథం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
వైద్యులు ఎంతగా ప్రయత్నించిన కానీ గురునాథం బ్రతకలేదని అక్కడున్నవారు వాపోతున్నారు. గురునాథం గత ఆరేళ్ళుగా విజయారెడ్డి దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. సూర్యాపేట జిల్లా వెలుగొండ గ్రామానికి చెందిన గురునాథం కు ఏడాదిన్నర కొడుకు..ప్రస్తుతం గురునాథం సతీమణి ఎనిమిది నెలల గర్భిణీ.