టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ టీమ్ సెలెక్టర్లపై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆదివారం ఇండియా, బంగ్లాదేశ్ మధ్య మొదటి టీ20 జరిగిన విషయం అందరికి తెలిసిందే. ఈ మ్యాచ్ లో భారత్ ఓడిపోవడంతో భావోద్వేగమైన వ్యాఖ్యలు చేసాడు యువీ. ముందు సెలెక్టర్స్ ను మార్చండి. అప్పుడు ఎలాంటి మ్యాచ్ ఐనా గెలవొచ్చు. వారు నెమ్మదిగా ఉంటే జట్టు కూడా అంతే నెమ్మదిగా ఉంటుందని యువీ అభిప్రాయపడ్డాడు. సెలెక్టర్ల విషయంలో ముగిసిన ప్రపంచకప్ నుండి ఏదోక వాదన జరుగుతూనే ఉంది. మరి ఈ మాటలను పరిగణలోకి తీసుకుని మార్పు చేస్తారా లేదా అనేది వేచి చూడాలి.
