పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు దిలీప్ ఘోస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోడ్లపై ఆవు మాంసం తింటున్న మేధావులంతా కుక్క మాంసం కూడా తింటే ఆరోగ్యం బాగుంటుందని సూచించారు. బుర్దాన్లో ఏర్పాటు చేసిన గోపా అష్టమి కార్యక్రమంలో దిలీప్ ఘోష్ మాట్లాడుతూ.. కొందరు మేధావులు రోడ్లపై ఆవు మాంసం తింటున్నారు. అలాంటి వారికి తాను చెప్పదలచుకున్నాను. ఒక్క ఆవు మాంసమే తినడం ఎందుకు? కుక్క మాంసంతో పాటు ఇతర జంతువుల మాంసాన్ని కూడా తింటే ఆరోగ్యంగా ఉంటారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వంటలను మీ ఇంట్లోనే చేసుకోండి అని సూచించారు దిలీప్ ఘోష్. ఆవు తమకు తల్లి లాంటిది. అమ్మతో సమానమైన ఆవు పాలను తాగుతాం. అలాంటి ఆవుతో ఎవరైనా పెట్టుకుంటే తాము తగిన బుద్ధి చెప్తామని దిలీప్ హెచ్చరించారు. ఆవును చంపి తినడం మహా పాపమని ఆయన స్పష్టం చేశారు.
Tags ఆవు మాంసం కుక్క మాంసం దిలీప్ ఘోస్ పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా పార్టీ
Related Articles
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
November 19, 2023