తుమ్మలపల్లి లో వైసీపీ జెండాను చెరిపివేసి జాతీయ జెండాను మళ్లీ యధావిధిగా రూపొందించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ గ్రామ సెక్రటేరియట్ ఏర్పాటుచేసి ప్రజలకు అన్ని రకాల సదుపాయాలు అన్ని రకాల సబ్సిడీలు అన్ని రకాల సర్టిఫికెట్లు ఒకేచోట అందించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనేక ఉద్యోగ నియామకాలు కూడా చేపట్టారు. అయితే ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి అన్ని సదుపాయాలు దొరుకుతున్న అన్న విషయం ప్రజలకు తెలియజేసే క్రమంలో గ్రామ సెక్రటేరియట్ లకు పార్టీ రంగులు వేశారు వైసీపీ కార్యకర్తలు. ఇందులో భాగంగా ఓ గ్రామంలో జాతీయ జెండాను చెరిపివేసి వైసీపీ రంగులు వేయడం పట్ల పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. అయితే చేసిన తప్పును సరిదిద్దుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారు వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ జాతీయ జెండాను మరింత అందంగా చిత్రీకరించారు.